
హర్తాళ్ విజయవంతంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు
హర్తాళ్‌కు సహకరించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేయడం మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందకు గాను సోమవారం నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హర్తాళ్‌ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.