దూసుకెళుతున్న అజయ్ మల్హోత్ర | VK Malhotra made convenor of BJP poll coordination panel | Sakshi
Sakshi News home page

దూసుకెళుతున్న అజయ్ మల్హోత్ర

Nov 14 2013 1:13 AM | Updated on Mar 29 2019 9:18 PM

ఢిల్లీ విధానసభ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్ర రాజకీయవారసుడిగా

 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్ర రాజకీయవారసుడిగా ఈమారు ఎన్నికల బరిలోకి దిగుతున్న అజయ్ మల్హోత్ర సొంత పంథాలో ముందుకెళుతున్నారు. విజయ్‌కమార్ మల్హోత్ర కుమారుడైన విజయ్‌కుమార్ మల్హోత్ర తన తండ్రికి కలిసొచ్చిన నియోజకవర్గమైన గ్రేటర్ కైలాశ్ నుంచి పోటీపడుతున్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే నియోజకవర్గ ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. పార్టీ టికెట్ లభించినప్పటి నుంచి వరుసగా బీజేపీ జాతీయ స్థాయి నాయకులను కలుస్తూ వారి ఆశ్వీర్వాదాలు పొందుతున్నారు. 
 
 బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్,అగ్రనేత అద్వానీ, సుష్మాస్వరాజ్ ఇలా రోజుకొకరి కలుస్తూ వార్తలో నిలి చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గపరిధిలోని ఓటర్లకు చేరువయ్యేందుకు పాదయాత్రలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తెరతీసిన కొందరు నాయకుల్లో ఒకడైన అజయ్‌కుమార్ మల్హోత్ర రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు గ్రేటర్‌కైలాశ్ నియోజకవర్గ ప్రజల చే తుల్లో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement