అంజలలో విమల్ నందిత | Vimal Nandita in Anjala Movie | Sakshi
Sakshi News home page

అంజలలో విమల్ నందిత

Feb 25 2015 1:40 AM | Updated on Sep 2 2017 9:51 PM

అంజలలో విమల్ నందిత

అంజలలో విమల్ నందిత

యువజంట విమల్ నందిత నాయికా నాయకులుగా నటిస్తున్న చిత్రం అంజల. స్టంట్ మాస్టర్,

 యువజంట విమల్ నందిత నాయికా నాయకులుగా నటిస్తున్న చిత్రం అంజల. స్టంట్ మాస్టర్, దిలీప్ తొలిసారిగా నిర్మాతగా మారి తన ఫార్మర్ మాస్టర్‌ప్లాన్ ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు తంగం శరవణన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఒక టీ కొట్టు చుట్టూ ఉండే జనాలు వారి జీవన విధానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా అంజల ఉంటుందన్నారు. మదురై సమీపంలోని చోళవందాని గ్రామం నేపథ్యంగా చిత్ర కథ జరుగుతోందన్నారు. చెన్నై మేల్‌మరువత్తూరు మదురై, కుట్రాలం తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశుపతి, మురుగదాస్, ఇమాన్ అన్నాచ్చి, పంజు సుబ్బు, దర్శకుడు ఆర్ వి ఉదయకుమార్, ఎళిల్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి రవికన్నన్ ఛాయాగ్రహణం, గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement