ఆధునికత దిశగా వ్యవసాయం | Towards the modernization of agriculture | Sakshi
Sakshi News home page

ఆధునికత దిశగా వ్యవసాయం

Sep 29 2014 3:19 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది.

సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement