గుంటూరులో టీడీపీ నేత హత్య | tdp Bc cell president murdered in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరులో టీడీపీ నేత హత్య

Aug 30 2016 12:37 PM | Updated on Aug 10 2018 8:23 PM

గుంటూరు జిల్లా టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏమినేడి వెంకటేశ్వరరావు(40) ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా మంగళవారం వేకువజామున దుండగులు ప్రవేశించి కత్తులతో పొడిచి చంపారు. ఉదయం స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు అర్బన్ సౌత్ జోన్ డీఎస్‌పి బి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement