కటకటాలపాలైన కార్లదొంగ | Suspected car thief caught in Modesto | Sakshi
Sakshi News home page

కటకటాలపాలైన కార్లదొంగ

Jan 8 2014 11:20 PM | Updated on Sep 2 2017 2:24 AM

కార్ల తాళాలను స్మార్టుగా తీసి వాటిని కాజేస్తున్న ఓ దొంగను అరెస్టు చేయడంతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచి పోలీసులు.

సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తాళాలను స్మార్టుగా తీసి వాటిని కాజేస్తున్న ఓ దొంగను అరెస్టు చేయడంతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచి పోలీసులు. భేషరమ్ సిమాలోమాదిరిగా ఏకారుకు అవతలి వ్యక్తి నుంచి డిమాండ్ ఉంటే ఆ కారును ఎంపిక చేసుకుని మరీ వాటినే కాజేస్తున్నట్టు క్రైం బ్రాంచ్‌అదనపు కమిషనర్ రవిందర్‌యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. యూపీలోని మీరట్ జిల్లా శ్యామ్‌నగర్‌కి చెందిన మెహతాబ్ అనే వ్యక్తి కార్లు దొంగిలించి ఇతర రాష్ట్రాలకు వాటిని తరలిస్తున్నట్టు క్రైం బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు.
 
 నిందితుడు ఇటీవల చోరీ చేసిన  ఓ కారును హైదర్‌పురాలోని మ్యాక్స్ ఆసుపత్రి సమీపంలో విక్రయించేందు వస్తున్నట్టు స్థానిక వేగుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడే మాటువేసి ఉన్నపోలీసులు నిందితుణ్ని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. జావెద్ అనే మరో వ్యక్తితో కలిసి తాను కార్లు చోరీ చేస్తున్నట్టు మెహతాబ్ తెలిపాడు. ఎలక్ట్రానిక్ తాళాలను పగులగొట్టడంతో వీరిద్దరూ ఆరితేరారు. ముందుగా ఎంపిక చేసుకున్న కారు తాళాలను తెరచి తాపీగా అక్కడి నుంచి జారుకుం టారు. ఎదుటివారు సైతం గుర్తించలేనంతలా వీరు ప్రవర్తింస్తారని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం మూడు చోరీ కేసులు పరిష్కారం అయినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఓ టయోటా క్వాలిస్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. జావెద్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగిలిన కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఏసీపీ ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement