సుశాంత్‌తో త్వరలో కొత్త చిత్రం | srinivas gavireddy visits bayyavaram | Sakshi
Sakshi News home page

సుశాంత్‌తో త్వరలో కొత్త చిత్రం

Oct 13 2016 7:58 AM | Updated on Aug 28 2018 4:32 PM

సుశాంత్‌తో త్వరలో కొత్త చిత్రం - Sakshi

సుశాంత్‌తో త్వరలో కొత్త చిత్రం

వైవిద్య కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభించనున్నట్టు వర్ధమాన సినీ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు.

వర్ధమాన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి
 
మాకవరపాలెం: వైవిద్య కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభించనున్నట్టు వర్ధమాన సినీ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. దసరాకు స్వగ్రామం బయ్యవరం వచ్చిన ఆయన, నర్సీపట్నంలో ఓ కార్యక్రమానికి వచ్చిన   హాస్యనటుడు రా కింగ్ రాకేష్‌తో కలిసి  ‘సాక్షి’ విలేకరితో కాసేపు మాట్లాడారు.  

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు  తెలిపారు. డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని, కన్నడ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఇందులో సీనియర్ న టుడు రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తారన్నారని శ్రీనివాస్ చెప్పారు.ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథ ఉంటుందని, వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.

తన మొదటి చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య చిత్రాలు’ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని గుర్తుచేశారు. హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా..: హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా కమెడియన్ అయ్యా నని రాకింగ్ రాకేష్ చెప్పారు. కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్టుగా  గుర్తింపురావడం ఆనందంగా ఉందన్నారు.

నిత్యం బిజీగా ఉండే తాను ఇలా పల్లెటూరుకు రావడం కూడా సంతోషంగా ఉందన్నారు. బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నానన్నారు. ప్రస్తుతం లక్ష్మీబాంబు, పెళ్లికిముందు ప్రేమకథ, శరభతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానన్నారు. శరభ తెలుగు, తమిళంలో కూడా తానే కమెడియన్‌గా చేస్తున్నానని తెలిపారు. ఓ మంచి హాస్య నటుడిగా పేరుతెచ్చుకోవడమే లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement