స్థానిక బ్రూస్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి
సెక్యూరిటీ గార్డు దారుణహత్య
Nov 22 2016 3:28 AM | Updated on Sep 4 2017 8:43 PM
బళ్లారి అర్బన్ : స్థానిక బ్రూస్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 5 గంటల మధ్యలో గుర్తు తెలియని దుండగులు సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి హతమార్చినట్లు బ్రూస్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ దొడ్డి తెలిపారు. స్థానిక ఇందిరానగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్(54) రాఘవేంద్ర థియేటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బ్రూస్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement