‘సచిన్ అభిమానుల కల సాకారం’ | Sachin elected to the Bharat Ratna award | Sakshi
Sakshi News home page

‘సచిన్ అభిమానుల కల సాకారం’

Nov 16 2013 11:17 PM | Updated on Sep 2 2017 12:40 AM

అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు పలువురు రాష్ట్ర ప్రముఖులు శనివారం అభినందనలు తెలిపారు.

ముంబై:   అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు పలువురు రాష్ట్ర ప్రముఖులు శనివారం అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మంది సచిన్ అభిమానుల కల సాకారమైందని గవర్నర్ కె.శంకరనారాయణన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇదే పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు సైతం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ దక్కిన ఈ అరుదైన గౌరవం మనదేశ యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. ఆయన గొప్పక్రీడాకారుడేగాక సహృదయుడని ప్రశంసిం చారు. భారతీయులను ఐక్యంగా ఉంచడంలోనూ సచిన్ సఫలమయ్యారని ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement