breaking news
k.shankar narayana
-
ఉర్దూకు ‘మహా’ గౌరవం
భివండీ, న్యూస్‌లైన్: ఉర్దూ భాషకు మహారాష్ట్రలో సముచిత స్థానం లభించిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం జరిగిన జి.ఎం.మోమిన్ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన అఖిల భారతీయ ఉర్దూ మహా సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉర్దూ భాష తన అస్తిత్వాన్ని కాపాడుకుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం గౌరవం లభించిందన్నారు. ఉర్దూ భాష ఉనికిని కాపాడడం కోసం జీ.ఎం. మోమిన్ గర్ల్స్ కళాశాల ఇటువంటి మహాసమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా చేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉర్దూ భాష వికాసం కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కె.శంకరనారాయణన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫౌజియాఖాన్, ఠాణే జిల్లా ఇంచార్జి మంత్రి గణేశ్ నాయిక్, మైనారిటీ శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సచిన్ అభిమానుల కల సాకారం’
ముంబై: అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు పలువురు రాష్ట్ర ప్రముఖులు శనివారం అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మంది సచిన్ అభిమానుల కల సాకారమైందని గవర్నర్ కె.శంకరనారాయణన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇదే పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సైతం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ దక్కిన ఈ అరుదైన గౌరవం మనదేశ యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. ఆయన గొప్పక్రీడాకారుడేగాక సహృదయుడని ప్రశంసిం చారు. భారతీయులను ఐక్యంగా ఉంచడంలోనూ సచిన్ సఫలమయ్యారని ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.