రోడ్డు ప్రమాదంలో రిజర్వ్‌ పోలీస్‌ మృతి | Reserve Police Died in road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రిజర్వ్‌ పోలీస్‌ మృతి

Dec 28 2016 1:42 AM | Updated on Aug 30 2018 4:10 PM

కణ్ణమంగలం సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో రిజర్వ్‌ పోలీస్‌ మృతి చెందాడు. తిరువణ్ణామలై జిల్లా గురుమాతాంగల్‌ గ్రామానికి చెందిన దేవరాజ్‌(20) వేలూరులో రిజర్వ్‌ పోలీస్‌గా పనిచేస్తున్నాడు.

తిరువణ్ణామలై: కణ్ణమంగలం సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో రిజర్వ్‌ పోలీస్‌ మృతి చెందాడు. తిరువణ్ణామలై జిల్లా గురుమాతాంగల్‌ గ్రామానికి చెందిన దేవరాజ్‌(20) వేలూరులో రిజర్వ్‌ పోలీస్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బైకులో విధులకు బయలు దేరాడు. కణ్ణమంగళం సమీపంలోని వేలూరు–ఆరణి రోడ్డులో అమ్మాపాళ్యం క్రాస్‌ వద్ద వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కణ్ణమంగళం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement