నేడు తీర్పు | Praveen togadiya Bangalore entering the High Court on Friday | Sakshi
Sakshi News home page

నేడు తీర్పు

Feb 6 2015 1:44 AM | Updated on Aug 31 2018 8:24 PM

నేడు తీర్పు - Sakshi

నేడు తీర్పు

విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌తొగాడియా బెంగళూరులో ప్రవేశించకుండా నగర పోలీసులు విధించిన నిషేదంపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.

బెంగళూరు :  విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌తొగాడియా బెంగళూరులో ప్రవేశించకుండా నగర పోలీసులు విధించిన నిషేదంపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. తనపై ఉన్న నిషేదాన్ని తొలగించాలంటూ హైకోర్టులో ప్రవీణ్ తొగాడియా రిట్‌పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. తొగాడియా తరఫున సీనియర్ న్యాయవాది వీ.వీ ఆచార్య, ప్రభుత్వం తరఫున రవివర్మ  వాదనలను వినిపించారు. తీర్పునే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, తొగాడియా వివాదంలో న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని మీడియాతో రాష్ర్ట హోం శాఖ మంత్రి కె.జె.జార్‌‌జ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement