‘హోదా’ ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్‌బాబు | New Executive Committee of APNGO | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్‌బాబు

Feb 13 2017 4:10 PM | Updated on Mar 23 2019 9:10 PM

‘హోదా’ ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్‌బాబు - Sakshi

‘హోదా’ ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్‌బాబు

ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు

విజయవాడ: ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ఉద్యోగులుగా మద్ధతిస్తామన్నారు. రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటం చేస్తే హోదా రాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ వెళ్లి హోదా కోసం పోరాటం చేయాలన్నారు. హోదా హామీ ఇచ్చిన రాజకీయపార్టీలు తమ హామీని నిలబెట్టుకోవాలన్నారు. అంతకుముందు ఏపీఎన్‌జీఓ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఎన్జీవో అధ్యక్షుడిగా  అశోక్‌బాబు ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement