‘గరివిడి లక్ష్మి’తో బుర్రకథకు పూర్వవైభవం | Garividi Lakshmi Movie Brings Andhra Forgotten Burrakatha Art Back To Life, Check Out Interesting Story Inside | Sakshi
Sakshi News home page

‘గరివిడి లక్ష్మి’తో బుర్రకథకు పూర్వవైభవం

Oct 11 2026 1:05 PM | Updated on Oct 11 2026 2:02 PM

Garivadi Lakshimi Brings Burrakatha Back Into Focus

వారి గొంతున మాటలు పాటలై ప్రవహిస్తాయి.. వారి పలుకుల్లో అచ్చ తెలుగు పదాలు రథాలు కట్టి పరుగులు తీస్తాయి.. అచ్చమైన ఉత్తరాంధ్ర యాసలో వినిపించే కథలు శ్రవణానందంగా ప్రతిధ్వనిస్తాయి. వారే బుర్రకథ కళాకారులు. బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు అన్నట్టు కొనసాగుతున్నారు. కాలం ఈ కళను మరుగున ఉంచేసింది. సినిమాలు, టీవీలు, తాజాగా రీల్స్‌ ప్రభావంతో బుర్రకథ కళ తప్పింది. అంతటి మహత్తరమైన కళాకారులు నిశ్శబ్దమైపోయారు. గరివిడి లక్ష్మి సినిమా రాకతో మళ్లీ ఇన్నాళ్లకు వారిపై చర్చ జరుగుతోంది.                                
  – శ్రీకాకుళం కల్చరల్‌  

న్రేను వచనం.. మా వారు హాస్యం 
బుర్ర కథ కళాకారిణిగా 30 ఏళ్లకు పైగా ఉంటున్నాను. నేను వచనం చెప్తే, మా వా రు దేవానందం హాస్యం చెపుతారు. ప్రభుత్వ, ప్రైవే టు ప్రదర్శనలు 10 వేల వరకు ఇచ్చాం. గరివిడి లక్ష్మి ప్రదర్శన చేస్తున్నప్పుడు నేను చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు డ్యాన్సులు తప్ప కథ ఉండడం లేదు అందుకే దూరంగా ఉంటున్నాను.
   – లోపింటి సుజాత, కళాకారిణి, రాజాం  

మ్రూడు దశాబ్దాలుగా.. 
మా కుటుంబం అంతా కళాకారులే కావడంతో చిన్నతనం నుంచి బుక్ర కథ కళకు ఇంటిలో ప్రోత్సాహం లభించింది. నేను వచనం చెప్పేదాన్ని. మా తండ్రి పంచాది చంద్రరావు, అన్నయ్య రమణారావు కూడా కళాకారులే. సుమారు మూడు దశాబ్దాలుగా వెయ్యి వరకు ప్రదర్శనలు ఇచ్చాం. ఇప్పుడు ప్రదర్శనలకు దూరమయ్యాం.  ప్రస్తుతం రామయ్యతండ్రి పండగకు పందిరిపాటలు పాడుతున్నాను.
– సీపాన కృష్ణవేణి, గోకర్ణపల్లి, పొందూరు మండలంఘా

ఆ రోజులే వేరు 
బుర్రకథలంటే ఆరోజుల్లో ఎంతో ఆదరణ ఉంది. మేము ప్రదర్శనకు వస్తే గ్రామాల్లో ఎంతో ఆదరించేవారు. నా పదహారో ఏట నేను మొదటి సారిగా స్టేజి ఎక్కి ప్రదర్శన చేశాను. నేను వచనంతో పాటు గా సెంటర్‌ కథ కూడా చెప్పేదాన్ని. 1500 వరకు ప్రదర్శనలు చేశాను. మా పేద పరిస్థితిని బట్టి నేను ఒక పక్క చదువుతూ మరో ప్రక్క ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. దానిద్వారా వచ్చిన డబ్బుతో ఫీజులు, పుస్తకాలు కొనుక్కొని చదివాను.  ప్రముఖ కళాకారిణి గరివిడి లక్ష్మి గ్రూపు తో సమానంగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. గ్రామాల్లో నోట్ల దండలతో మమ్మల్ని సత్కరించేవారు. గరివిడి లక్ష్మి సినిమాగా రావడం గర్వంగా ఉంది. నేడు బుర్రకథల ప్రదర్శనలలో ఆశ్లీలత కనిపిస్తోంది. ట్రూపులో ఎంత మంది యువతులు ఉన్నారో అడిగి ప్రదర్శన బుక్‌ చేస్తున్నారు. ఇది తగదు.    
– అలిగి రమాదేవి, బుర్రకథ కళాకారిణి, శ్రీకాకుళం 

క్రళను కాపాడాలి 
ప్రాచీన జానపద కళారూపమైన బురక్రథకు మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేస్తున్న గరివిడి లక్ష్మి చిత్రం విజయ వంతం కావాలి. ఒక్క బురక్రథ కాదు  జముకుల పాట, పందిరి పాట, తూర్పు భాగవతం, పులి వేషధారణలు, వీరణం, బిందెల నృత్యాలు ఇవన్నీ కూ డా మన ప్రాచీన కళారూపాలే. వీటిని కాపాడాలి.   
– వి.జగన్నాథంనాయుడు, ఇంటాక్‌ అదనపు కన్వీనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement