వేలకోట్ల అప్పు తప్ప సీఎం ఏం సాధించారు? | mlc ponguleti sudhakarreddy criticised cm kcr | Sakshi
Sakshi News home page

వేలకోట్ల అప్పు తప్ప సీఎం ఏం సాధించారు?

Sep 28 2016 5:03 PM | Updated on Mar 18 2019 9:02 PM

వేలకోట్ల అప్పు తప్ప సీఎం ఏం సాధించారు? - Sakshi

వేలకోట్ల అప్పు తప్ప సీఎం ఏం సాధించారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో కాంట్రాక్టర్లే సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో కాంట్రాక్టర్లే సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు రెండున్నరేళ్లు గడుస్తున్నా కేసీఆర్ లో ఇంకా మార్పు రాలేదన్నారు. 27 నెలల్లో రూ.40 వేల కోట్లు అప్పు తేవడం తప్ప సాధించింది ఏముందని ప్రశ్నించారు.

తాను లేస్తేనే తెల్లవారుతుంది అనుకొనే మనస్తత్వం కేసీఆర్‌దని పొంగులేటి విమర్శించారు. సకల జనుల మనోభావాలకు కేసీఆర్ విరుద్ధంగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏదేదో చేసి స్పెషల్ ట్రీట్‌మెంట్ పొందుతున్నారని చెప్పారు. లాబీయింగ్ చేసి తెలంగాణ తెచ్చానన్న కేసీఆర్ రాష్ట్రానికి నిధులెందుకు తేవడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు కోరడం లేదు.. ఎందుకు లాలూచీ పడుతున్నారని ఈ సందర్భంగా సీఎంను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబుతో రాజీపడొద్దు అని పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement