మద్యం మత్తులో ఎమ్మెల్యే తనయుడి వీరంగం | mla son attack on youth in alcohal effect | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఎమ్మెల్యే తనయుడి వీరంగం

Published Thu, Aug 11 2016 5:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

మద్యం మత్తులో ఎమ్మెల్యే తనయుడి వీరంగం

బెంగళూరు(బనశంకరి): బెంగళూరులోని శాంతినగర ఎమ్మెల్యే కుమారుడు మద్యం మత్తులో ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన  వెలుగుచూసింది. వివరాలు... శాంతినగరలోని ప్లాన్‌బీ పబ్‌లో ఎమ్మెల్యే హ్యారిస్‌ కుమారుడు ఉమర్‌ పీకల దాకా మద్యం సేవించి, మత్తులో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో బాధిత యువకుడు అశోకనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు  అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement