హీరో విశాల్‌కు హైకోర్టు నోటీసులు | Madras high court orders notice to actor vishal | Sakshi
Sakshi News home page

హీరో విశాల్‌కు నోటీసులు..

Jan 3 2017 8:23 AM | Updated on Oct 8 2018 3:56 PM

హీరో విశాల్‌కు హైకోర్టు నోటీసులు - Sakshi

హీరో విశాల్‌కు హైకోర్టు నోటీసులు

ప్రముఖ హీరో విశాల్‌ రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయాల్సిందిగా చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెన్నై: ప్రముఖ హీరో విశాల్‌ రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయాల్సిందిగా మద్రాస్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే తమిళ నిర్మాతల మండలి కార్యవ్యవహార ధోరణిని విమర్శిస్తూ విశాల్‌ పత్రికలకెక్కిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నిర్మాతల మండలి కార్యవర్గం విశాల్‌ నుంచి వివరణ కోరుతూ లేఖ రాసింది. అయితే  ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించకపోవడంతో అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేశారు.

దీంతో విశాల్‌ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు.

ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కల్యాణ సుందరం సమక్షంలో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫున హాజరైన న్యాయమూర్తి వాదిస్తూ ఈ కేసులో  విశాల్‌ తన విచారాన్ని వ్యక్తం చేస్తే అతడిపై నిషేధాన్ని రద్దు చేయడానికి సిద్ధమని తెలిపారు. దీంతో  విశాల్‌ తరఫున బదులివ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement