వినూత్నంగా వివాహం | Sakshi
Sakshi News home page

వినూత్నంగా వివాహం

Published Mon, Feb 5 2018 7:55 AM

karnataka young couple marriage differently - Sakshi

చామరాజనగర (బొమ్మనహళ్లి) : క్రికెట్‌పై ఉన్న అభిమానంతో ఓ జంట భారతీయ జెండా చేతపట్టుకుని, బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని బంధువుల సమక్షంలో శనివారం ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడి చామరాజనగర భ్రమరాంబ కళ్యాణమంటపంలో శనివారం ఉదయం కార్తీక్, శ్వేతల పెళ్లికి పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇద్దరికి క్రికెట్‌ అంటే పిచ్చి అభిమానం. పెళ్లి తంతు జరుగుతుండగా భారత్‌ అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలుచుకున్న సమాచారం తెలుసుకున్న  వధూవరులు పెళ్లి వేదికపై అప్పటికప్పుడు భారత్‌ అండర్‌–19 జట్టు సభ్యుల ఫ్లెక్సీని తెప్పించి తలకు బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని అందరి సమక్షంలో కార్తీక్, శ్వేతలు వివాహం చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. క్రికెట్‌ పిచ్చి అంటే ఇదే మరి అంటూ పెళ్లి భోజనం ఆరగించి దీవించి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement