రేసులో ఉన్నా: అంబరీష్ | iam in race for kpcc chairman post says ambarish | Sakshi
Sakshi News home page

రేసులో ఉన్నా: అంబరీష్

May 6 2015 6:34 AM | Updated on Sep 3 2017 1:33 AM

రేసులో ఉన్నా: అంబరీష్

రేసులో ఉన్నా: అంబరీష్

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నట్లు రాష్ర్ట గృహ నిర్మాణశాఖ మంత్రి అం బరీష్ ప్రకటించారు.

బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నట్లు రాష్ర్ట గృహ నిర్మాణశాఖ మంత్రి అం బరీష్ ప్రకటించారు. ఆ పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయానికి మంగళవా రం వచ్చిన ఆయన కార్యకర్తలతో కొద్ది సేపు ముచ్చటించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని హైకమాండ్ ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ను ఆదేశించిన విషయమై తనకు సమాచారం లేదన్నారు. తాను మాత్రం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద 3.17 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్ర గృహ మండలి ఇప్పటి వరకూ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించిన ఘటన ఏదీ జరగలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి అంబరీష్ సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement