ఆగ్రహించిన హోంగార్డులు | Homeguards stage protest in Delhi | Sakshi
Sakshi News home page

ఆగ్రహించిన హోంగార్డులు

Sep 29 2014 10:06 PM | Updated on Sep 2 2018 3:08 PM

తమ సర్వీసును రద్దు చేయడంపై ఆగ్రహించిన వందలాదిమది ఢిల్లీ హోంగార్డులు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు.

 న్యూఢిల్లీ: తమ సర్వీసును రద్దు చేయడంపై ఆగ్రహించిన వందలాదిమది ఢిల్లీ హోంగార్డులు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం గం 12.15 సమయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంగార్డులు....ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా వీరంతా కేంద్ర  హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసం దిశగా దూసుకుపోయేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
 
 పొడిగించమని కోరాం: లవ్లీ
 ఈ విషయమై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ ‘గత ఏడాది లెఫ్టినెంట్ గవర్నర్‌ని తాము కలిశాం. హోంగార్డుల కాంట్రాక్టు కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని కోరాం. వారి కాంట్రాక్టు గడువు ముగిసినందువల్ల ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కచ్చితంగా పొడిగించాలి. అయితే వారి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించాల్సిందిపోయి కొత్తవారిని నియమిస్తోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు. సర్వీసు రద్దు కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. ఇందువల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఆందోళనకు దిగడం తప్ప వారికి మరో మార్గమే లేదన్నారు. వారి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించాలన్నారు. అలాచేస్తే వారికి తిరిగి జీవనోపాధి లభిస్తుందన్నారు. కేంద్ర హోం శాఖ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు.
 
 బీజేపీ, ఆప్ కుమ్మక్కు
 అనంతరం డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కుమ్మక ్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు హోంగార్డుల సమస్యలను గాలికొదిలేశాయన్నారు. వారి హక్కులను కాపాడడంలో విఫలమయ్యాయన్నారు. హోంగార్డుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామంటూ విధానసభ ఎన్నికల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట ఇచ్చారని, 49 రోజులపాటు అధికారంలో ఉండికూడా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని అన్నారు.ఇప్పుడు బీజేపీ చేస్తున్నదికూడా ఏమీలేదన్నారు. ఆందోళన అనంతరం హోంగార్డుల సంఘానికి చెందిన త్రిసభ్య బృందం తమ డిమాండ్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేసింది. కాగా హోంగార్డులను అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో విధుల్లోకి తీసుకున్న సంగతి విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement