నకిలీ పాస్‌పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్ | fake passbooks gang arrested in adilabad district | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

Sep 30 2016 12:33 PM | Updated on Aug 17 2018 2:56 PM

నకిలీ పాస్ పుస్తకాల సాయంతో బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖానాపూర్: నకిలీ పాస్ పుస్తకాల సాయంతో బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహాణీలు సృష్టించి అధికారుల ఫోర్జరీ సంతకాల సాయంతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు యత్నించిన ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, పలు ఆఫీసుల స్టాంపులు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల ఆఫీసు ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement