ఎయిర్‌పోర్టులో చిన్నారికి తీవ్ర గాయాలు | child seriously injured in the Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో చిన్నారికి తీవ్ర గాయాలు

Oct 5 2016 9:41 AM | Updated on Sep 4 2017 4:17 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అరవింద్‌రావు దంపతులు తమ కూతురు నవ్య(6)తో కలసి బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారి నవ్య డిపార్చర్ రైలింగ్ పైనుంచి కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయాలుకాగా చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement