
జయ @ 68
పురట్చి తలైవి, సీఎం జయలలిత బుధవారం 68వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. తమ అమ్మ జన్మదిన
సాక్షి, చెన్నై: పురట్చి తలైవి, సీఎం జయలలిత బుధవారం 68వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. తమ అమ్మ జన్మదిన వేడుకల్ని కోలాహలంగా జరుపుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్రంలో పండుగ సందడి నెలకొంది.‘పురట్చితలైవిగా, తమిళనాట అందరినోట అమ్మగా పిలువబడే జయలలిత నిజంగానే విప్లవ వనిత అన్నది జగమెరిగిన సత్యం. నిర్ణయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీసుకోవడంలో ఆమెకు ఆమే సాటి.
ఏదీ చేసినా అందరికీ భిన్నంగానూ, సంచలనాలు సృష్టించడంలో ఆమెది ప్రత్యేక శైలి.’ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాను న్న ఎన్నికల ద్వారా మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా ముం దుకు సాగుతున్న అమ్మ జయలలి త 68వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో అన్నాడీఎం కే వర్గాలకు ఈ పర్వదినం ఓ పం డుగే. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వాడ వాడల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.
పండుగ సందడి : వాడ వాడల్లో సోమవారం నుంచే పండుగ
వాతావరణం నెలకొంది. ఎటు చూసినా జయలలిత ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు రోడ్లు మీద దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే అధినేత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ వర్గాలు పలు రకాల క్రీడా పోటీల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఉన్నారు. ఆలయాల్లో హోమాది పూజలు, యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మంగళం వారం కూడా ఈ పూజలు కొనసాగాయి. ఇక, బుధవారం జరిగే వేడుకల్లో 68 కేజీలతో కేక్‌లను కట్ చేయడానికి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి ఉన్నాయి. ఉదయాన్నే ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. పార్టీ అనుబంధ విభాగాల నేతృత్వంలో ఒక్కో చోట, ఒక్కో తరహాలో పేదల సంక్షేమ పథకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. ఉచిత దోవతి, చీరలు, కుట్టు మిషన్లు, ఇలా అనేక రకాాల వస్తువుల్ని పేదలకు అందజేయబోతున్నారు. ఇక దేవాదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలోని 6,868 ఆలయాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. జన్మదిన శుభాకాంక్షల్ని తమ అమ్మకు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున రాయ పేటలోని పార్టీ కార్యాలయానికి, పోయెస్‌గార్డెన్‌లోని ఆమె ఇంటికి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో ఆ పరిసరాల్లో ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పోలీసులు పటిష్టం చేశారు.
జాబితా విడుదల అయ్యేనా : అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ అధికార పగ్గాలు లక్ష్యంగా సీఎం జయలలిత వ్యూహ రచనతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభ్యర్థుల తొలి జాబితాను ఆమె విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బర్త్‌డే ఆమెకు చాలా స్పెషల్ కావడంతో ఆ రోజు జాబితా విడుదలకు తగ్గ కసరత్తులు జరిగి ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో ఈ బర్త్‌డే వేళ ఎన్నికల సంబంధించి, కార్యకర్తలు,నాయకుల్ని ఉద్దేశించి ఏదేని ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనే విధంగా, ఏ పార్టీ అయినా కలసి వస్తే రెండాకుల చిహ్నం మీద ఆ అభ్యర్థులు బరిలోకి దిగాల్సిందేనన్న మెలికను తమ అమ్మ పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటుండడం గమనార్హం.