జగమంత కుటుంబం | 200 family members get to gather | Sakshi
Sakshi News home page

జగమంత కుటుంబం

May 22 2017 2:03 AM | Updated on Sep 5 2017 11:40 AM

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం

కర్ణాటకలోని కొప్పళ జిల్లా శ్రీరామనగర్‌లో ఆదివారం ఒకే కుటుం బానికి చెందిన సుమారు 200 మంది ఒకేచోట కలిశారు.

కర్ణాటకలో ఒకేచోట కలిసిన 200 మంది కుటుంబ సభ్యులు
శ్రీరామనగర్‌ (కర్ణాటక):
కర్ణాటకలోని కొప్పళ జిల్లా శ్రీరామనగర్‌లో ఆదివారం ఒకే కుటుం బానికి చెందిన సుమారు 200 మంది ఒకేచోట కలిశారు. పొప్పొప్పుల బుల్లివెంకన్న, సూరమ్మ దంపతులు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అన్నవరపాడు నుంచి 60 ఏళ్ల క్రితం శ్రీరామనగర్‌కు వచ్చి వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరికి ఏడుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి కొడుకులు, కుమార్తెలు, వారి భార్యలు, భర్తలు, పిల్లలు సుమారు 200 మంది ఆదివారం శ్రీరామనగర్‌ నివాసంలో కలుసుకున్నారు.

యోగక్షేమాలు తెలుసుకుని పలకరించుకున్నారు. పిండి వంటలు, ఆటపాటలతో సరదాగా గడిపారు. డబ్బు దస్కం కంటే కుటుంబ అనుబంధాలు విలువైనవని తమ కలయిక ద్వారా నేటి తరానికి వీరు చాటిచెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement