రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి | 2 killed in lorry accident at mahabubnagar | Sakshi
Sakshi News home page

రెండు లారీలు డీ: ఇద్దరు మృతి

Oct 1 2016 9:37 AM | Updated on Oct 8 2018 5:07 PM

మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు. శనివారం ఉదయం రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాయిచూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement