ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
స్కూల్ ఆటో బోల్తా: 10 మందికి గాయాలు
Nov 2 2016 2:19 PM | Updated on Sep 15 2018 5:45 PM
మఠంపల్లి: ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఆటోలో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది విద్యార్థులున్నట్టు స్థానికులు తెలిపారు. ఓవర్‌లోడ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు.
Advertisement


