సిరీస్‌ చేజారదిక... భారత్, దక్షిణాఫ్రికా  | Women's fourth T20 Cancel | Sakshi
Sakshi News home page

సిరీస్‌ చేజారదిక... భారత్, దక్షిణాఫ్రికా 

Feb 22 2018 1:29 AM | Updated on Feb 22 2018 1:29 AM

Women's fourth T20 Cancel - Sakshi

భారత మహిళల జట్టు

సెంచూరియన్‌: ఇప్పటికే దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు... టి20 సిరీస్‌నూ దక్కించుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన నాలుగో టి20 వర్షం కారణంగా రద్దయింది.  భారత్‌ ప్రస్తుతం సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టి20 24న కేప్‌టౌన్‌లో జరుగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయి నా సిరీస్‌ 2–2తో ముగుస్తుంది. భారత్‌ గెలిస్తే మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనలో ఏకకాలంలో వన్డే, టి20 సిరీస్‌ నెగ్గిన జట్టుగా గుర్తింపు పొందుతుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా స్కోరు 15.3 ఓవర్లలో 130/3తో ఉన్న దశలో వర్షం వచ్చింది. వాన తగ్గకపోవడంతోఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కెప్టె న్‌ నికెర్క్‌ (55; 2 సిక్స్‌లు, 6 ఫోర్లు), లీజెల్లి లీ (58; 5 సిక్స్‌లు, 2 ఫోర్లు) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.  

Advertisement
 
Advertisement
Advertisement