వారి సరసన కోహ్లి చేరేనా?

Will Kohli join league of Wadekar Kapil Dravid by winning Test series - Sakshi

హైదరాబాద్‌: విరాట్‌ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టిన నుంచి టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమం‍లో భారత కెప్టెన్‌ మరో ఆరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం లభించింది. వచ్చే నెల్లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్‌ గెలిస్తే మాజీ సారథులు అజిత్‌ వాడేకర్‌, కపిల్‌దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సరసన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చేరతాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ గడ్డపైన భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచింది మూడు సార్లు మాత్రమే అది కూడా ఈ దిగ్గజాల (వాడేకర్‌, కపిల్‌దేవ్‌, ద్రవిడ్‌) సారథ్యంలోనే. సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనిల సూపర్‌ కెప్టెన్సీలో కూడా సాధ్యం కానిది కోహ్లి సారథ్యంలో టీమిండియా సాధిస్తుందో వేచి చూడాలి.  

1971లో తొలిసారి..
అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో1971లో తొలి సారి టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డపై ఆ దేశాన్ని ఓడించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ సారథ్యంలోనే(1986) మరోసారి బ్రిటీష్‌ జట్టుపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిసారిగా రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలో(2007) మూడో సారి సిరీస్‌ను నిలబెట్టుకుంది.

గంగూలి, ధోని కెప్టెన్సీలో నిరాశే..
ఎన్నో అంచనాల మధ్య 2002లో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్‌, కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తూ భారత్‌ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ను డ్రాతో సరిపెట్టుకుంది. 2014లో కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కెప్టెన్సీలో భారత జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ చిత్తుగా ఓడిపోయింది. తాజాగా కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు ఇంగ్లండ్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top