నా అనుమానం క్లియర్ : సాహా | West Indies tour helped clear self doubt, says Wriddhiman Saha | Sakshi
Sakshi News home page

నా అనుమానం క్లియర్ : సాహా

Sep 2 2016 3:44 PM | Updated on Sep 4 2017 12:01 PM

నా అనుమానం క్లియర్ : సాహా

నా అనుమానం క్లియర్ : సాహా

వెస్టిండీస్ పర్యటన తన కెరీర్లో కీలక మలుపు కాకపోయినా, తనకున్న ఎన్నో సమాధానాలకు ఈ పర్యటన జవాబిచ్చిందని యువ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు.

కోల్కతా: వెస్టిండీస్ పర్యటన తన కెరీర్లో కీలక మలుపు కాకపోయినా, తనకున్న ఎన్నో సమాధానాలకు ఈ పర్యటన జవాబిచ్చిందని యువ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు. గతంలో భారీ స్కోర్లు చేయలేననే ఒక అనుమానం మనసులో బలంగా ఉండేదని, అయితే వెస్టిండీస్ పర్యటనలో సెంచరీ చేయడం ద్వారా దాన్ని నివృతి చేసుకోగలిగినట్లు సాహా పేర్కొన్నాడు.

'గతంలో ఎప్పుడూ టెస్టు మ్యాచ్ ఆడినా బ్యాటింగ్ లో స్థాయికి తగ్గ ఆట ఆడే అవకాశం తక్కువగా వచ్చేది. దీంతో నేను భారీ స్కోర్లు చేయలేమోనని అనుమానం ఏర్పడింది. అయితే వెస్టిండీస్లో సెంచరీ చేయడంతో నా అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. నాకు చాలా సంతృప్తి ఇచ్చిన ఇన్నింగ్స్ లో ఈ సెంచరీ కూడా ఒకటి. ఒక బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడి నాపై ఉంచిన నమ్మకాన్నినిలబెట్టడంతో నాపై నమ్మకం పెరిగింది  ' అని సాహా తెలిపాడు.

2010లో దక్షిణాఫ్రికా సిరీస్తో టెస్టుల్లో సాహా అరంగేట్రం చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో రెండు హాఫ్ సెంచరీలు చేయగా, పలుమార్లు ముప్ఫై పరుగుల వద్దే నిష్ర్కమించాడు. తాజా వెస్టిండీస్ టూర్లో తొలుత 40, 47 పరుగులు నమోదు చేసిన సాహా.. ఆ తరువాత సెంచరీతో సత్తా చాటాడు. దాదాపు 22 టెస్టు ఇన్నింగ్స్ ల తరువాత సాహా తన కెరీర్ లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement