విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ కన్నుమూత

West Indies Cricketer Everton Weekes Dies At Age Of 95 - Sakshi

జమైకా : విండీస్‌ లెజెండరీ బ్యాట్స్‌మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 95 ఏళ్ల ఎవర్టన్‌ వీక్స్‌ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 1948- 58 మధ్య 48 టెస్టులాడిన ఎవర్టన్‌ 58.61 స్ట్రైక్‌రేట్‌తో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 19 అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా ఎవర్టన్‌ మృతిపై కరీబియన్‌ జట్టు స్పందిస్తూ.. ' ది లెజెండ్‌ సర్‌ ఎవర్టన్‌ వీక్స్‌.. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఒక దిగ్గజ ఆటగాడు వదిలివెళ్లడం మా గుండెల్ని పిండేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఎవర్టన్‌ కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ' అంటూ ట్వీట్‌ చేసింది.


1950వ దశకంలో క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్‌ వీక్స్‌లు త్రీ డబ్యుఎస్‌గా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురిలో వాల్కట్‌ 2006లో, వొరెల్‌ 1967లో మృతి చెందగా.. తాజాగా ఎవర్టన్‌ మరణంతో త్రీ డబ్యుస్‌ శకానికి ముగింపు పలికినట్లయింది. వీరి సేవలకు గుర్తుగా విండీస్‌ క్రికెట్‌ బోర్డు బ్రిడ్జ్‌టౌన్‌లోని నేషనల్‌ స్టేడియం పేరుకు త్రీ డబ్యుఎస్‌గా నామకరణం చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top