టెస్టుల్లో కోహ్లి ‘టాప్‌’ ర్యాంకు పదిలం

Virat Kohli Stays On Top And Labuschagne Moves To Number 3  - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లి తన టాప్‌ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు. అతను 928 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతుండగా... 911 రేటింగ్‌ పాయింట్లతో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్‌ తాజా బ్యాటింగ్‌ సంచలనం మార్నస్‌ లబ్‌షేన్‌ తొలిసారిగా మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 549 పరుగులు చేయడం అతనికి కలిసొచి్చంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో రాణించి ఇంగ్లండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ 10వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాట్స్‌మెన్‌లలో పుజారా ఒక స్థానం దిగువకు పడిపోయి ఆరో స్థానంలో, రహనే రెండు స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా (794) తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top