వార్నర్ ను వెనక్కునెట్టిన కోహ్లి!

Virat Kohli breaks into top-5 in latest ICC Test rankings - Sakshi

దుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. శ్రీలంకతో తొలి టెస్టు అనంతరం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లి తన స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్-5కు చేరాడు. లంకేయులతో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో  కోహ్లి శతకం సాధించాడు. ఫలితంగా 807 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఐదో స్థానంలో నిలవగా, వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 936 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్(889 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(880) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా(866 రేటింగ్ పాయింట్లు) నాల్గో స్థానాన్నినిలబెట్టుకోగా, కేఎల్ రాహుల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా,  అశ్విన్ నాల్గో స్థానాన్ని కాపాడుకున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top