విరాట్ సేన చితక్కొట్టుడు! | virat kohli and pujara slam centuries against england in second test | Sakshi
Sakshi News home page

విరాట్ సేన చితక్కొట్టుడు!

Nov 17 2016 3:09 PM | Updated on Sep 4 2017 8:22 PM

విరాట్ సేన చితక్కొట్టుడు!

విరాట్ సేన చితక్కొట్టుడు!

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు శతకాలతో కదం తొక్కారు.

విశాఖ:ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు శతకాలతో కదం తొక్కారు. తొలుత పూజారా 184 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం చేయగా, ఆ తరువాత కాసేపటికి విరాట్ కోహ్లి 154 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ పూర్తి చేశాడు. ఇది పూజారా టెస్టు కెరీర్లో 10 వ సెంచరీ కాగా, విరాట్ కెరీర్లో 14వ టెస్టు శతకం. పూజారా సిక్స్ కొట్టి సెంచరీ మార్కును దాటగా, విరాట్ మాత్రం సెంచరీ చేయడానికి కొన్నిబంతులను వృథా చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement