చాంప్స్‌ తై జు యింగ్, అక్సెల్‌సన్‌ | Viktor Axelsen And Tai Tzu Ying Are The Champions In All England Tournament | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ తై జు యింగ్, అక్సెల్‌సన్‌

Mar 16 2020 2:57 AM | Updated on Mar 16 2020 2:57 AM

Viktor Axelsen And Tai Tzu Ying Are The Champions In All England Tournament - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చాంపియన్స్‌గా నిలిచారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అక్సెల్‌సన్‌ 21–13, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్‌ సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గగా... తై జు యింగ్‌ 21–19, 21–15తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ చెన్‌ యుఫె (చైనా)ను బోల్తా కొట్టించింది. 1999లో పీటర్‌ గేడ్‌ తర్వాత ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచిన తొలి డెన్మార్క్‌ ప్లేయర్‌గా అక్సెల్‌సన్‌ గుర్తింపు పొందాడు.  సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన అక్సెల్‌సన్, తై జు యింగ్‌లకు 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement