
తెలుగు టైటాన్స్‌కు మూడో టై
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మూడో టై నమోదు చేసింది. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్ 45-45తో టైగా ముగిసింది
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మూడో టై నమోదు చేసింది. ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్ 45-45తో టైగా ముగిసింది. మ్యాచ్ మధ్యలో కాస్త అలసత్వాన్ని ప్రదర్శించిన తెలుగు టైటాన్స్ జట్టు రెండో అర్ధభాగంలో అద్భుతమైన రైడింగ్‌తో ఆకట్టుకుంది. ప్రత్యర్థి సూపర్ రైడర్ కాశీలింగ్ ఆడాకే ఒంటిచేత్తో ఢిల్లీ జట్టుకు పాయింట్లు అందించినా.. చివర్లో అద్భుతంగా కట్టడి చేసింది. స్కోరు 45-45 వద్ద రైడింగ్‌కు వచ్చిన అడాకే.. హుడాను అవుట్ చేశాడు. అయితే రివ్యూలో ఇది నాటౌట్‌గా తేలడంతో మ్యాచ్ టై అయ్యింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 31-18తో పుణేరి పల్టాన్‌పై నెగ్గింది.