
కిర్మాణీకి జీవితకాల సాఫల్య పురస్కారం
బీసీసీఐ ప్రతి ఏటా ఇచ్చే జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది సయ్యద్ కిర్మాణీ ఎంపికయ్యారు.
బీసీసీఐ ప్రతి ఏటా ఇచ్చే జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది సయ్యద్ కిర్మాణీ ఎంపికయ్యారు. గురువారం సమావేశమైన బీసీసీఐ అవార్డుల కమిటీ ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత తొలి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద కిర్మాణీకి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.