తమ సమావేశాల్లో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయంలో పూర్తి అధికారం
శ్రీనివాసన్‌కు అనుమతిపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తమ సమావేశాల్లో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయంలో పూర్తి అధికారం బీసీసీఐకే ఉందని సుప్రీం కోర్టు తేల్చింది. దీంట్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎమ్‌ఐ కలీఫుల్లాతో కూడిన బెంచ్ తెలిపింది. ‘శ్రీనివాసన్ విషయంలో ఇంకా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయో లేదో బీసీసీఐ చూసుకోవాలి.
ప్రతిసారీ మా దగ్గరకు రావాల్సిన పని లేదు. అసలు ఆయనపై ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడండి. మేం జనవరిలో ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా పేర్కొన్నాం. మీ ప్రతి నిర్ణయంపై మా ముద్ర ఉండాలని కోరుకుంటున్నారా? ఒకవేళ ఆయనకు ఏమైనా సమస్య ఉంటే కోర్టుకు వస్తారు’ అని బీసీసీఐకి ఘాటుగా సమాధానమిచ్చింది.
ఠాకూర్‌పై పిటిషన్ ఉపసంహరణ
బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ విజ్ఞప్తి మేరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై వేసిన క్రిమినల్ పిటిషన్‌ను శ్రీనివాసన్ ఉపసంహరించుకున్నారు.