‘హే స్మిత్‌... నిన్ను చూస్తే జాలేస్తోంది’ | Steve Smith Slammed By England Fans Over Mocking Jack Leach | Sakshi
Sakshi News home page

‘హే చీటర్‌.. నువ్వు మారవా ఇక?!’

Sep 10 2019 8:37 PM | Updated on Sep 10 2019 8:37 PM

Steve Smith Slammed By England Fans Over Mocking Jack Leach - Sakshi

లండన్‌ : యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు నుంచీ ప్రతీ మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్‌ అభిమానులు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను టార్గెట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక స్మిత్‌ సహా వార్నర్‌ మైదానంలోకి దిగినప్పుడల్లా ‘చీటర్‌.. చీటర్‌’ అంటూ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్‌ విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో వారు కోపంతో రగిలిపోతున్నారు. ఇందుకుతోడు ఈ విజయంలో డబుల్‌ సెంచరీతో రాణించి స్మిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడాన్ని సహించలేకపోతున్నారు. ఈ క్రమంలో స్మిత్‌ కూడా వారిని మరింత ఉడికించేలా నాలుగో టెస్టులో గెలుపొందిన తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలో ఫుల్‌గా ఎంజాయ్‌ చేశాడు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జాక్‌ లీచ్‌లాగా తాను కూడా కళ్లకు అద్దాలు పెట్టుకుని అతడిని అనుకరించాడు. 

చదవండి : ‘స్మిత్‌ జీవితాంతం మోసగాడిగానే గుర్తుంటాడు’

ఈ క్రమంలో ఆతిథ్య జట్టు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మరోసారి స్మిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ హే స్మిత్‌ నువ్వు మారవా. బుద్ది రాలేదా ఇంకా. స్టోక్స్‌కు మద్దతుగా నిలిచి జాక్‌ లీచ్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. తను నీలాగా చీటర్‌ కాదు. తనను ఎందుకు వెక్కిరిస్తున్నావు. నువ్వు క్లాస్‌లెస్‌ ప్లేయర్‌వి. నిన్ను చూస్తే జాలేస్తోంది. నువ్వు గ్లాస్ కొనగలవేమో గానీ. క్లాస్‌ ఆటను కొనలేవు’ అంటూ అతడిపై విరుచుకుపడుతున్నారు. కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయంతో యాషెస్‌ మరోసారి ఆసీస్‌ సొంతం అయ్యింది. నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించిన ఆసీస్‌ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2-2తో సమం అవుతాయి గనుక యాషెస్‌ ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుందన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement