
వర్షం వల్ల రెండో రోజు ఆట రద్దు
క్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు.ఆదివారం వర్షం కురవడంతో రెండో రోజు ఆట నిర్వహించడానికి సాధ్యపడలేదు.
బెంగళూరు: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు.ఆదివారం వర్షం కురవడంతో రెండో రోజు ఆట నిర్వహించడానికి సాధ్యపడలేదు. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో మ్యాచ్ నిర్వహణకు అడ్డంకిగా మారింది. దీంతో రెండో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి.
రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పైచేయి సాధించడంతో ఆటను వీక్షించాలనుకున్న అభిమానులకు వర్షం నిరాశ కలిగించింది. . తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ కాగా, టీమిండియా 80/0 స్కోరు చేసిన సంగతి తెలిసిందే.