శ్రీకాంత్ సంచలనం | Srikanth Defeats Olympic Champion Chen Long to Win the Title | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ సంచలనం

Jun 25 2017 12:08 PM | Updated on Sep 5 2017 2:27 PM

శ్రీకాంత్ సంచలనం

శ్రీకాంత్ సంచలనం

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో రియో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)పై విజయం సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. హోరాహోరీగా సాగిన అమీతుమీ పోరులో శ్రీకాంత్ 22-20, 21-16 తేడాతో చెన్ లాంగ్ ను మట్టికరిపించాడు. 45 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్ లో రెండు గేమ్ ల్లోనూ తీవ్రమైన పోటీని ఎదుర్కొన శ్రీకాంత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.తొలి గేమ్ ను 25 నిమిషాలు పాటు జరగగా, రెండో గేమ్ 20 నిమిషాల్లో ముగిసింది.

 

అంతకుముందు వీరిద్దరూ ఐదుసార్లు తలపడిన ముఖాముఖి పోరులో చెన్ లాంగ్ నే పైచేయి సాధించాడు. కాగా, కొంతకాలంగా సూపర్ ఫామ్లో ఉన్న శ్రీకాంత్.. లాంగ్ పై ఉన్న ఆ రికార్డుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్లోనూ శ్రీకాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ ను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కాగా, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనతను భారత్ నుంచి సాధించింది శ్రీకాంతే కావడం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement