'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది' | Shocked at Tharanga's omission from Cup squad, says Muralitharan | Sakshi
Sakshi News home page

'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

Jan 9 2015 5:13 PM | Updated on Sep 2 2017 7:27 PM

'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగకు చోటు కల్పించకపోవడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

దుబాయ్: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగకు చోటు కల్పించకపోవడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉపుల్ తరంగకు ఉద్వాసన పలికి యువ ఆల్ రౌండర్ జీవన్ మెండిస్ కు చోటు కల్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని మురళీధరన్ పేర్కొన్నాడు.

తరంగకు వన్డేల్లో మంచి రికార్డు ఉందని, అతడి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నాడు. అయితే తరంగను కాదని జీవన్ ను ఎంపిక చేయడం సబబుగా లేదని అభిప్రాయపడ్డాడు. ఐదు ప్రపంచకప్ లు ఆడిన మురళీధరన్ 67 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement