‘దాదా గెలిచిన జట్టువైపు ఉన్నారు’

Shah Rukh Khan Special Message For Ganguly Over KKR Lost Match To DC - Sakshi

‘శుభ్‌మన్‌ గిల్‌, రసెల్‌ అద్భుతంగా ఆడారు. మ్యాచ్‌లో ఓడిపోవడం హృదయాన్ని మెలిపెట్టే అంశమే కానీ.. ప్రత్యేకించి బౌలింగ్‌ కారణంగా ఓడిపోవడం బాధ కలిగించి. ఈ మ్యాచ్‌లో సానుకూల అంశం ఏదైనా ఉందంటే అది దాదా(గంగూలీ) మాత్రమే. ఈడెన్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టువైపు ఆయన ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అభినందనలు’ అంటూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ గంగూలీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. రసెల్‌(21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడటంతో కేకేఆర్‌ 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. ధావన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో అద్భుత విజయం సాధించింది.

చదవండి : ఢిల్లీ గర్జన

ఈ నేపథ్యంలో కోల్‌కతా ఓటమి గురించి షారుఖ్‌ పైవిధంగా స్పందించాడు. తమ జట్టు పతనానికి కారణమైన మాస్టర్‌ మైండ్‌, ఒకప్పటి కేకేఆర్‌ కెప్టెన్‌ గంగూలీపై తనకు ఏమాత్రం అభిమానం తగ్గలేదని ట్వీట్‌ ద్వారా పేర్కొన్నాడు. షారుఖ్‌ ట్వీట్‌కు ఫిదా అయిన అభిమానులు.. ‘ ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినంత మాత్రాన మన సూపర్‌ టీమ్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. ఐపీఎల్‌ ట్రోఫీ మన సొంతమవుతుంది. దాదాపై అభిమానం చాటుకుని ‘ట్రూ కింగ్‌ ఇన్‌ ఆల్‌ సెన్స్‌’ అని నిరూపించుకున్నావ్‌’  అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గతంలో కేకేఆర్‌తో జట్టుకట్టిన బెంగాల్‌ దాదా గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అడ్వైజర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top