‘సెహ్వాగ్‌ వేరే దేశానికి ఆడుంటే మరెన్నో రికార్డులు’

Sehwag Would Have More Records, If Played Another Country, Latif - Sakshi

క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు..

ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు..

కరాచీ: భారత క్రికెట్‌ జట్టులో డాషింగ్‌‌ ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసిన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలో సెహ్వాగ్‌తో కలిసి ఆడిన సందర్భాలను గుర్తు చేసుకున్న లతీఫ్‌.. ప్రపంచ క్రికెట్‌లో సెహ్వాగ్‌ది ప్రత్యేక స్థానమన్నాడు. సెహ్వాగ్‌ మ్యాచ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు ముందుగానే భయపడేవని లతీఫ్‌ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. కాట్‌ బిహైండ్‌ అనే ఒక యూట్యూబ్‌ షోలో మాట్లాడిన లతీఫ్‌.. సెహ్వాగ్‌ను విధ్వసంకర క్రికెటర్‌గా పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో కలిసి సెహ్వాగ్‌ మరొక దేశం తరఫున ఆడి ఉంటే రికార్డులు మీద రికార్డులు కొల్లగొట్టేవాడన్నాడు. స్వదేశంలోనైనా విదేశంలోనైనా సెహ్వాగ్‌ దూకుడు ఒకే రకంగా ఉండేదన్నాడు. అతను సాధించిన పరుగులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయన్నాడు. టెస్టు క్రికెట్‌లో 8వేలకు పైగా పరుగులు సాధించిన సెహ్వాగ్‌.. మరొక దేశానికి ఆడుంటే పది వేల పరుగులను సునాయాసంగా సాధించేవాడన్నాడు. (‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’)

భారత్‌ తరఫున ఆడటం వల్లే సెహ్వాగ్‌ కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోయిందనే  విషయాన్ని లతీఫ్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. సచిన్‌, ద్రవిడ్‌ల నీడలో ఆడటం వల్లే  సెహ్వాగ్‌ ప్రతిభ తగ్గిపోయిందన్నాడు. ‘ సెహ్వాగ్‌ది ఎప్పుడూ ఆధిపత్య ధోరణే. మేము ఓపెనర్లగా బరిలోకి దిగితే పిచ్‌ స్వభావం, బౌలర్లు ఎవరు అనే విషయాన్ని ఫోకస్‌ చేసేవాళ్లం. సెహ్వాగ్‌ నైజం అలాంటింది కాదు. ఇక్కడ పిచ్‌, బౌలర్‌ అనేది సెహ్వాగ్‌కు సెకండరీ. దూకుడే అతని మంత్రం.  గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ వంటి స్టార్‌ బౌలర్లు బౌలింగ్‌ చేసినా సెహ్వాగ్‌ బెదిరేవాడుకాదు. ఏ ఒ‍క్క బౌలర్‌కి భయపడిన సందర్భాల్లో సెహ్వాగ్‌లో లేవు. ఒక ప్రభావంతమైన క్రికెటర్‌. సెహ్వాగ్‌ ఆటను  చూసి ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అతని జట్టులో సెహ్వాగ్‌ ఒక చెరగని ముద్ర  వేశాడు. వరల్ఢ్‌ క్రికెట్‌లో ఒక సక్సెస్‌ఫుల్‌ ఆటగాడు సెహ్వాగ్‌’ అని లతీఫ్‌ పేర్కొన్నాడు. సెహ్వాగ్‌ అనేవాడు మరొక దేశానికి ఆడి ఉంటే అతనికుండే క్రేజే వేరుగా ఉండేదన్నాడు. తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్‌.. 8,586 పరుగులు చేశాడు. (సర్ఫరాజ్‌కు డిమోషన్‌..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top