సాత్విక్‌-చిరాగ్‌ జోడి కొత్త చరిత్ర | Satwiksairaj Pair Created History In Badminton | Sakshi
Sakshi News home page

సాత్విక్‌-చిరాగ్‌ జోడి కొత్త చరిత్ర

Aug 4 2019 3:20 PM | Updated on Aug 4 2019 5:49 PM

Satwiksairaj Pair Created History In Badminton - Sakshi

బ్యాంకాక్‌: భారత బ్యాడ్మింటన్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్‌ తరఫున సూపర్‌-500 టైటిల్‌ను గెలిచిన తొలి జోడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భాగంగా పురుషుల డబల్స్‌ టైటిల్‌ను గెలవడం ద్వారా నూతన రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఫైనల్లో  సాత్విక్‌-చిరాగ్‌ల జోడి 21-19, 18-21, 21-18 తేడాతో లి జున్‌ హు- యు చెన్‌(చైనా) ద్వయంపై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకున్నారు.

తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ల ద్వయం.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్‌ జోడి అంచనాలకు మించి రాణించింద. రెండో ర్యాంక్‌ చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టింది. సుదీర్ఘ ర్యాలీలో ఆకట్టకున్న సాత్విక్‌ జోడి చివరకు గేమ్‌తో మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని భారత పురుషుల డబుల్స్‌ విభాగంలో నయా రికార్డును లిఖించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement