క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట | Saketh Pair Enter Quarters of ATP Challenger | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట

Mar 7 2019 10:21 AM | Updated on Mar 7 2019 10:23 AM

Saketh Pair Enter Quarters of ATP Challenger - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జుహై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాకేత్‌ మైనేని (భారత్‌)–సంచాయ్‌ రటివటానా (థాయ్‌లాండ్‌) ద్వయం 6–4, 6–4తో మూడో సీడ్‌ శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–హాన్స్‌ హచ్‌ వెర్డుగో (మెక్సికో) జోడీపై విజయం సాధించింది.

61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ జంట మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఒక్కో సెట్‌లో ఒక్కోసారి ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో నికోలా కాచిచ్‌ (సెర్బియా)–హిరోకి మొరియా (జపాన్‌) జోడీతో సాకేత్‌–సంచాయ్‌ ద్వయం తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement