సీఏసీలోకి మళ్లీ సచిన్, లక్ష్మణ్‌! | Sachin Tendulkar, Laxman Back To CAC | Sakshi
Sakshi News home page

సీఏసీలోకి మళ్లీ సచిన్, లక్ష్మణ్‌!

Nov 30 2019 1:34 AM | Updated on Nov 30 2019 1:34 AM

Sachin Tendulkar, Laxman Back To CAC - Sakshi

కోల్‌కతా: గతంలో రద్దయిన క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏఏ)ని శనివారం మళ్లీ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూ ల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి ఇందులో సభ్యులుగా పునరాగమనం చేసే అవకాశం ఉందని సమాచారం. కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కారణంగా ఈ కమిటీ నుంచి సచిన్, వీవీఎస్‌ ఇంతకు ముందు తప్పుకున్నారు. అయితే గంగూలీ బోర్డు అధ్యక్షుడైన నేపథ్యంలో సీఏసీ మళ్లీ సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్‌ కమిటీని కూడా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement