ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ | Ruthvika entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ

Feb 5 2015 12:57 AM | Updated on Sep 2 2017 8:47 PM

ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ

ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియషిప్‌లో తెలంగాణ అమ్మాయిలే టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణా దాస్, ఆరో సీడ్ రుత్వికా శివానిలిద్దరూ సెమీఫైనల్స్‌లో విజయం సాధించారు.

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
 విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియషిప్‌లో తెలంగాణ అమ్మాయిలే టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణా దాస్, ఆరో సీడ్ రుత్వికా శివానిలిద్దరూ సెమీఫైనల్స్‌లో విజయం సాధించారు. బుధవారం జరిగిన సెమీస్‌లో రీతుపర్ణ 21-17, 21-18తో టాప్ సీడ్ పి.సి. తులసీ (పెట్రోలియం)పై, రుత్విక 13-21, 21-13, 21-17తో రెండో సీడ్ అరుంధతి పంట్వానే (పెట్రోలియం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో పెట్రోలియంకు ఆడుతున్న హైదరాబాదీ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ తుదిపోరుకు అర్హత సంపాదించాడు.
 
 సెమీస్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21-14, 21-16తో అభిమన్యు సింగ్ (ఎఫ్‌సీఐ)పై గెలువగా... టాప్ సీడ్ ప్రణయ్ (పెట్రోలియం) 14-21, 18-21 తేడాతో మూడో సీడ్ సమీర్ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మనూ అత్రి(ఏఏఐ)- సుమిత్ రెడ్డి(ఏపీ) 21-19, 21-18 తేడాతో అల్విన్ ఫ్రాన్సిస్ (కేరళ)-అరుణ్ విష్ణు (పెట్రోలియం)పై, రెండో సెమీస్‌లో ప్రణవ్ చోప్రా (పెట్రోలియం)-అక్షయ్ 21-23, 21-14, 21-17తో షలోక్ రామచంద్రన్ (ఏఐ)-సాన్యం శుక్లా (ఏఐ)పై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో ఐదో సీడ్ అపర్ణాబాలన్-ప్రజక్తా సావంత్ (పెట్రోలియం) 21-14, 21-13తో ధాన్య నాయర్ (రైల్వే)-మోహిత (ఏఏఐ)పై, ప్రద్న్యాగాద్రే-సిక్కిరెడ్డి (ఏఏఐ) 21-16, 21-13తో రీతుపర్ణ-రుత్విక జోడీపై విజయం సాధించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement