ఇక పోజులు చాలు.. బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయ్‌! | Rohit Stuns Instagram On Kedar Posing In Latest Post | Sakshi
Sakshi News home page

ఇక పోజులు చాలు.. బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయ్‌!

Dec 5 2019 3:16 PM | Updated on Dec 5 2019 3:16 PM

Rohit Stuns Instagram On Kedar Posing In Latest Post - Sakshi

న్యూఢిల్లీ:  ఎప్పుడో భారత క్రికెట్‌ జట్టులో అరంగేట్రం చేసినా జాతీయ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో కేదార్‌ జాదవ్‌ విఫలమవుతూనే ఉన్నాడు.  ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2019లో జాదవ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అతనిపై వేటు తప్పలేదు. సౌతాంప్టాన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు మినహా పెద్దగా రాణించలేదు. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకూ రెండు సెంచరీలు, 6 అర్థ శతకాల్ని జాదవ్‌ సాధించాడు.  ఇక 9 అంతర్జాతీయ టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులు మాత్రమే సాధించడంతో జాదవ్‌ను కనీసం పరిశీలించడం లేదు సెలక్టర్లు. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో జాదవ్‌ నిరాశ పరిచాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ తప్పితే ఆ టోర్నీ అంతా వైఫల్యం చెందాడు.

ఇదిలా ఉంచితే, తాజాగా జాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోపై టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాదవ్‌తో ఉన్న సాన్నిహిత్యమో ఏమో తెలీదు కానీ పోజు కొట్టడం ఆపి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్‌ చేశాడు. జాదవ్‌ పోస్ట్‌ చేసిన ఫోటోకు రోహిత్‌ శర్మ ఇలా రిప్లై ఇవ్వడంతో అభిమానుల్లో నవ్వులు  పూయించింది. అదే సమయంలో ఈ పోస్ట్‌ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్‌ పాపులర్‌ కూడా అయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement