క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్ | Ravichandran Ashwin becomes the ICC Cricketer of the Year | Sakshi
Sakshi News home page

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్

Dec 22 2016 1:19 PM | Updated on Sep 4 2017 11:22 PM

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నాడు.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నాడు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అతడు గెలుచుకున్నాడు. ఇక ఐసీసీ ఈ సంవత్సరానికి టెస్ట్, వన్డే టీమ్‌లను ప్రకటించింది. వన్డే టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా ఆలిస్టర్ కుక్ ఎంపికయ్యారు. క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టెన్, కుమార సంగక్కర ఈ జట్లను ఎంపిక చేశారు. 2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు వాళ్లు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జట్లను ఎంచుకున్నారు. 
 
టెస్టు జట్టులో నలుగురు ఇంగ్లండ్ క్రికెటర్లు, ముగ్గురు ఆస్ట్రేలియన్లు, ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కుక్‌ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడం ఇది మూడోసారి. డేల్ స్టైన్ జట్టుకు ఎంపిక కావడం తొమ్మిదేళ్లలో ఎనిమిదోసారి. జో రూట్, డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ వరుసగా మూడో ఏడాది కూడా ఎంపికయ్యారు. ఇక వన్డే జట్టులో మనవాళ్లు ముగ్గురు ఎంపికయ్యారు. కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది. 
 
జట్ల వివరాలు ఇలా ఉన్నాయి...
 
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం):
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా - వికెట్ కీపర్)
3. రోహిత్ శర్మ (ఇండియా)
4. విరాట్ కోహ్లీ (కెప్టెన్ -ఇండియా)
5. ఏబీ డివీలియర్స్ (దక్షిణాఫ్రికా)
6. జాస్ బట్లర్ (ఇంగ్లండ్‌)
7. మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
8. రవీంద్ర జడేజా (ఇండియా)
9. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
10. కగిసో రబడా (దక్షిణాఫ్రికా)
11. సునీల్ నరైన్ (వెస్టిండీస్)
12. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)
 
 
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం):
 
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్)
3. కేన్ విలియంసన్ (న్యూజిలాండ్)
4. జో రూట్ (ఇంగ్లండ్‌)
5. ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా)
6. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ - వికెట్ కీపర్)
7. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
9. రంగనా హీరత్ (శ్రీలంక)
10. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
11. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
12. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement