
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే తొలి అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కేరళలోని వాయనాడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. 14 మంది సభ్యుల బృందానికి మహారాష్ట్ర క్రికెటర్ అంకిత్ బావ్నె సారథ్యం వహిస్తాడు.
ఆంధ్ర రంజీ ఆటగాళ్లు కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్‌లకు ఈ జట్టులో చోటు లభించింది. ప్రస్తుత రంజీ సీజన్‌లో రికీ భుయ్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 775 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ అయిన భరత్ హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 178... బెంగాల్‌పై 61... పంజాబ్‌పై 76 పరుగులు చేశాడు.